నిజమైన స్నేహం
నిజమైన స్నేహం


సూర్యుడు వెలుగునివ్వడం వలన వెన్నెల వెదజల్లే చంద్రుడు
అదే సూర్యుణ్ణి మిత్ర ద్రోహి అన్నాడట
అలానే ఉంది నువ్వు నన్ను మిత్ర ద్రోహి అనడం
నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం
సొంత అస్తిత్వాన్ని కోల్పోతాడు
నా పేరుతో పిలిచినప్పుడు కన్నా
వీడు వాడి ఫ్రెండ్ రా అని
ఎవరైనా అన్నప్పుడు
నేనేదో ఒలంపిక్స్ మెడల్ సాధించినట్లు ఫీలయ్యే వాణ్ణి
నిజమైన స్నేహమంటే తన మిత్రుడు
చెడు దారిలో వెళుతున్నా అతని చేయి వదలక
అతడిని మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు
నువ్వు తాగి తప్పుగా మాట్లాడినా నేను నీతో స్నేహాన్ని వదులుకోలేదు
నిజమైన స్నేహం ఎప్పుడు తన స్నేహితుడు ఆపదలో ఉన్నా
సాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటుంది
గుర్తు లేదా అర్థ రాత్రి అయినా సరే నువ్వు ఆరోగ్యం బాలేదన్నా
బాధలో ఉన్నాను అన్నా
నేను పరుగెత్తుకు వచ్చాను
నీ సమస్యలన్నిటినీ నేను పరిష్కరించలేకపోవచ్చు
కానీ నువ్వు ఒంటరివి కాదు
నీకు తోడు ఉన్నాను అనే భావన కలిగించాను
నువ్వు ఈ సమస్యల్ని ఎడుర్కోగలవు
అని నీ శక్తిని నీకు గుర్తు చేశాను
నువ్వు నాకిచ్చిన బహుమతి ఏమిటి
మిత్ర ద్రోహి అన్న పేరు
జరిగిన దాన్ని అర్థం చేసుకోకుండా
నా పరిస్థితి ఏమిటో అని తెలుసుకోకుండా
నా మీద నిందలు వేశావు
నేను తప్పు చేశాను అని
నీకనిపిస్తే చెంప పగలగొట్టి
అడగాల్సింది
కానీ నువ్వు మిత్ర ద్రోహి అని చెప్పి
నాతో మాట్లాడ్డం మానేశావు
జీవితానికి సరిపడా అవమానాల్ని బాధని ఇచ్చి
వెళ్ళిపోయావు
సరే మిత్రమా
నిజమైన స్నేహం ఎప్పుడూ
తన స్నేహితుడి అపజయాన్ని కోరుకోదు
నేనెప్పుడూ నీ విజయాన్ని కోరుకునే
వ్యక్తుల్లో ఉంటాను
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా