నీవే ❤️❤️
నీవే ❤️❤️
ఎప్పుడూ నాకళ్ళముందే ఉండక్కర్లేదు
నానయనాల్లో తిష్టేవేశావుగా నీవే
ప్రతిపొద్దూ నాతోనే ఊసులాడక్కర్లేదు
చిరుగాలి సడిలోనూ వింటున్నా నీ పలుకే
ఎల్లప్పుడూ నాచేయిపట్టి నడవక్కర్లేదు
నానీడై వెన్నంటే ఉన్నావు నీవే
ప్రతిరేయీ జోలపాడక్కరలేదు
కనులు మూసినంతనే నీగానం నను జోకొట్టి నిదురపుచ్చుతుంది
అది నీఊహే నీమదిలో నన్నే నిలపక్కరలేదు
నాఎదలో వేలుపుగా కొలువుంచాగా నిన్నే
నీకోసమే ఈ నవ్వులు పువ్వులుగా నీకర్పించాలని
నీ కోసమే ఈ ఎదురుచూపులునువ్వొస్తే తివాచీ పరచాలని
నీకోసమే ఈ అలకలు మొలకెత్తే ఆశలు తీర్చగవస్తావని
నీకోసమే ఈ మెలికలు మైమరపించే నీ రూపం చూస్తున్నానని...
... సిరి ✍️

