నీవె ప్రియాసఖుడా
నీవె ప్రియాసఖుడా
హృదయవేణు రవములనే..చిందేవా బహుప్రియమున..!
ప్రణయరాగ మాలపించి..ముంచేవా మైమరపున..!
'వల'చిన నీ చినవాడిని..చూడవేల కడకంటను..
కాంతిపూల తోటలోన..నిలిపేవా అనునయమున..!
'అల'రించే శ్వాసలేలు..గాలికన్న మధువేదోయ్..
నీ చూపుల వెలుగుసాక్షి..చేసేవా నీ కొలువున..!
'కల'హించే జ్ఞాపకాల..గాయంతో ఎంత గొడవ..
నీ తియ్యని నవ్వురువ్వి..మాన్పేవా కడురయమున..!
ప్రతి కో'యిల' గుండెలయల..సవ్వడింట నీవేగా..
ఆవేదన గీతసుధగ..పొంగేవా తన గళమున..!
'శిల'శిలలో ప్రాణశిల్ప..రాశి నీవె ప్రియసఖుడా..
తలచినంత నీ రూపము..చూపేవా కణకణమున..!

