STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీదీ నాదీ...

నీదీ నాదీ...

1 min
239

నేను పీల్చే శ్వాసకు తెలుసు

నిన్ను మరువలేను అని 

నిను తలిచే నా మదికి తెలుసు

నీ జ్ఞాపకాలు వీడలేనివని 

నన్ను బ్రతికించే నా గుండెకు తెలుసు

నా ప్రాణం నీవేనని 

నా గుండెకు ఊపిరి అయిన నీకుతెలియదా

నీవే నా ప్రాణం అని 

నిను తొలిసారి చూసిన ఆ క్షణం

నాలో ఏదో తెలియని పరవశం 

నీ పలుకు విన్న ఆ నిముషం

నాలో ఏదో తీయదనం 

నీ తలపు తడిమిన ఆ వేళ.

నన్ను నేను మరచిపోయా 

ఎంత చూసినా తనివితీరని రూపం నీది 

ఎంత అలకబూనినా వీడిపోని బంధం నాది 

ఎన్నెన్నో జన్మల బంధమే నీదీ నాదీ 

ఎన్నటికీ వీడని అనుబంధమే నీదీ నాదీ...


  ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance