నీ వాడిని
నీ వాడిని
నీ వాడని తలపుకన్న..మధువులేదు గ్రోలేందుకు..!
ముక్కలైన గుండెకన్న..తోడులేదు పాడేందుకు..!
నిద్దురయే రానికనుల..కలనుచేర కోరుటెలా..
వేదించే అశ్రువుతో..పొత్తులేదు దాచేందుకు..!
రాయియైన స్పందించునె..కత్తికూడ యోచించునె..
నీ సంగతి ఏంచెప్పను..మత్తులేదు నవ్వేందుకు..!
రారమ్మని పిలువలేను..ఆశతోటి వేగలేను..
నిరాశతో గొడవలేదు..ముద్దులేదు బ్రతికేందుకు..!
పలకరించు లేతగాలి..జాడలేదు ఏమైందో..
నిప్పుపూల తోటచాలు..మనసులేదు ఇచ్చేందుకు..!
పరిమళించు వానంటే..నీ చూపే నాకు తెలిసి..
చూపలేని నావలపుకు..అలుపులేదు చూపేందుకు..!

