నీ తొలి పరిచయం...
నీ తొలి పరిచయం...
నీ తొలి పరిచయం నా మనసుకు పరిచయం చేసింది
ప్రేమలోని మధురానుభూతిని నీ పలుకు తేనెలూరు
నీ తీయని పలుకు వినిపించింది
మన ప్రేమకు అవధులు లేవని
నాపై నీకున్న ప్రేమ మాటలకందనిదని
నీ నవ్వు అపుడే విరబూసిన సిరిమల్లె
పువ్వు ఎపుడూ నీ పెదాలపై విరబూసి
స్వచ్ఛమైన కల్మషం లేని అందమైన నీ చిరునవ్వు చెబుతుంది.
చిరకాల మన స్నేహం ఎప్పటికీ చిగురుస్తూ ఉండాలని
నీ నయనాలు వెలుగు పూల దివ్వెలు
నీ కనులలో విరబూసిన వెన్నెల నా మనసుకు తెలిపే
హద్దులు లేని ప్రేమ ఏ నాటికీ వీడిపోదు ...
... సిరి ✍️

