STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ తలపే గీతంలా

నీ తలపే గీతంలా

1 min
109

నీ తలపే మేలుకొలుపు గీతంలా ఉంది..!

ఈ వెన్నెల నీ వలపుల వర్షంలా ఉంది..!


మంత్రశాస్త్ర పారాయణ పనే లేదు నాకు..

ప్రతిమేఘం అమృత ప్రేమ సాక్ష్యంలా ఉంది..!


నిఘంటువుల అర్థాలకు కాలమింక లేదు..

ప్రతికణమొక వెలుగుపూల కావ్యంలా ఉంది..!


చెమటచుక్క ఆరాటం తొలగు సమయమాయె..

ప్రతిచినుకొక చెలిమిగగన తీర్థంలా ఉంది..!


ప్రాణదీప చైతన్యం అరకన్నుల కోవెలలో..

ప్రతి తరువొక పరిమళించు అద్దంలా ఉంది..!



Rate this content
Log in

Similar telugu poem from Romance