STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ రాకకై...

నీ రాకకై...

1 min
352

కన్నులనే ప్రమిదులుగా మలచి 

దీపపు కాంతులను 

 కంటిలో నిలుపుకుని 

ఊహా లోకంలో విహరిస్తూ.., 

  నీ రాకకై వేచి చూస్తున్నా...


నీ కనురెప్పల కౌగిలిలో 

 నేనో అపురూప దృశ్యమై  

నిన్ను అల్లుకుపోవాలని...


రేయంతా నీ ధ్యాసే 

నీ ఊసే లేక చిన్నబోయిందని...


పెదవులేమో నిన్నే కలవరిస్తున్నాయి 

  అనుక్షణం తోడుంటా అని మాటిచ్చావ్ 

 నువ్వు పక్కన లేకున్నా 


నీ మాటనే తోడుగా భావించి 

నీవున్నావనే ఉహలోనే  బ్రతికేస్తున్నా 

  నిన్నే ఊహిస్తూ...


Rate this content
Log in

Similar telugu poem from Romance