నీ నవ్వే ప్రియా సఖి
నీ నవ్వే ప్రియా సఖి
కురుస్తున్న వర్షమెంత..తుంటరిదో తెలుసునీకు..!
నీతలపుల మేడలోన..నన్నుంచుట ముద్దునీకు..!
పరుగుతీయు మేఘాలకు..పగ్గమెలా వేయాలో..
ప్రేమమీర బంధింతువు..ఉండదులే అడ్డునీకు..!
చెలిమిపూల వాగంటే..నీ నవ్వే ప్రియసఖియా..
సరిహద్దులు రద్దుచేయు..విశ్వాసమె తోడునీకు..!
చైతన్యపు శిఖరాలను..చుంబించగ నేర్చేవా..
గగనాలను దాటగల్గు..సంకల్పమె బలమునీకు..!
మరపెరుగని మైమరపును..కానుకగా పొందేవా..
శ్వాసతోటి అల్లుకున్న..నీమనసే గురువునీకు..!
ఉచితాలకు ఆశపడే..ముచ్చటనే మానేవా..
శ్రమశక్తిని నమ్ముకునే..లక్షణమే ధనమునీకు..!

