STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ మనసున

నీ మనసున

1 min
6


అమాయకత చిరునామా..ఉంది చూడు..నీ మనసున..!


చెలిమిపూల వనమేదో..ఆగి చూడు..నీ మనసున..!


ప్రేమించడ మెక్కడుంది..అదే నీవు అయి ఉంటే..


అహంకార కిరీటాన్ని..తీసి చూడు నీ మనసున..!


ఒకరికొకరు అద్వితీయ..బహుమతి కద ఆలుమగలు..


'నేను-నాది', ముసుగలింక..కాల్చి చూడు నీ మనసున..!


పాఠంలా చెబుతుంటే..వినాలంటె ఎంత బాధ..


నిన్ను నీవు తెలుసుకోగ..మునిగి చూడు నీ మనసున..!


ఎదలోతుల మరుగుతున్న..శోకానికి అర్థమేమి..


వెంటాడే విరహగీతి..పాడి చూడు నీ మనసున..!


కర్మచక్ర గంధాలను..గమనించర మాధవుడా..


నీ వీడని సంకెళ్ళను..త్రెంచి చూడు నీ మనసున..!


Rate this content
Log in

Similar telugu poem from Romance