STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ మనసుకోసం

నీ మనసుకోసం

1 min
166

స్వార్థ చింతన విసిరివేసిన..మనసుకోసం వెతుకుతున్నా..!

అమృత ప్రేమను కురియ తెలిసిన..మబ్బుకోసం వెతుకుతున్నా..!


నీటి ఎద్దడి రాజ్యమేలే..కథలు ఏవో..కాల్చలేకే..

ఎవ్వరేలా మింగినారో..చెరువుకోసం వెతుకుతున్నా..!


అహంకారపు విందుభోజన ప్రియుల కాళ్ళకు మ్రొక్కనేలా..

కరువు దరువును..బూది చేసే నిప్పుకోసం వెతుకుతున్నా..!


పదవి మోజున..పేదరికమును..పెంచు పెద్దల నిలుప తరమే..?!

కాయకష్టం విలువ కాచే..తరువుకోసం వెతుకుతున్నా..!


కాసు బుడుగున మురిసిపోయే..కర్మనిరతుల యజ్నమేమో..?!

సత్య చింతన దారి చూపే..వెలుగుకోసం వెతుకుతున్నా..!



Rate this content
Log in

Similar telugu poem from Romance