నీ కోసమే..
నీ కోసమే..
వాకిట్లో తులసిమొక్కని గుమ్మంలో పసుపురాసిన గడపని
నట్టింట్లో మల్లెలు ముడుచుకున్న పడతిని
నిను గుండెల్లో దాచుకున్న నీదానిని
కనపడనేలేదా నేనంటూ ఉన్నానని
అనిపించనేలేదా నీకోసమే వేచున్నానని
అలా కళ్ళల్లోకి చూడమాకు కరిగిపోతాను కర్పూరమై
ఇలా ఉయ్యాలూపమాకు ఒదిగిపోతాను నీ గుండెలో గువ్వనై
ఎలానూ విడిచిపోమాకు మిగిలిపోతాను శిలలా జీవశ్చవాన్నై...
మనసంతా ఆనందంతో తేలిపోయింది చెలిమి నీడలో...
ఒక్కసారే నిస్పృహతో నిండిపోయింది విడిన వేళలో...
నిన్న రాతిరి ఊసన్నాలేదు నేటి రాతిరి దర్శనమేలేదు...
రేపటి రాతిరి ఏమవునోమరి దరిచేరి జోలపుచ్చుతావా...
చల్లగా జారుకుంటావా...జాలిలేని మనసా
అలా నవ్వుతావేమయ్యా...
...సిరి✍️

