నీ కోసమే చెలి
నీ కోసమే చెలి
నీకోసమే చూస్తున్నా
ఇంద్రధనుస్సు అంచు నీలి చీరలో
వడపోసిన అందాలన్నీ కుండపోత
వలకపోతలో వనాల జలకాలాటలలో
తడిసిన చెట్టు ముంగురుల స్పర్శ కోసమే
ఈ విరహ వేదన
నువ్వొస్తావని కృష్ణానది ఒడ్డున
గవ్వల మువ్వల్ని కువ్వలు చేశాను
కానుక చేసి ఇవ్వాలని
ఓసారి వచ్చిపో చెలీ!

