నీ గుండె
నీ గుండె
నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే
నీ గుండెకు చిల్లు పడడమేంటి
నీకు తప్ప ఎవరికి తెలుసు
గుచ్చుకునే భాధ ఎంతో...
భాధకు బంధానికి
దగ్గర సంబంధం
నీ ప్రేమ కాదంటావా
మనసు బరువు తెలియలేదెప్పుడు
మోస్తూ ఉన్న నీకు తప్ప
గుండె మంటల్ని ఆర్పేది
చల్లని నీ మాటలే
నన్ను కట్టి పడేసే నీ సాన్నిహిత్యంలో
ఇరుక్కు పోయానేమో..
నా ప్రతీ అడుగు నీతో నడుస్తూ ఉంటే
వెనక ముందు చీకటితో పనేముంది
అందం నేనయితే అణుకువ
నేర్పిన గురువు నువ్వగా...

