STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మధువేదో

మధువేదో

1 min
147

మంచుపూల గాలికన్న..మధువేదో ఉన్నదా..!

కలయెగాక కరిగిపోని..నిజమేదో ఉన్నదా..! 


చూపులనిధి కల్పతరువు..సాక్షికదా నీ మనసు.. 

ప్రేమరుచిని అందించే..రుజువేదో ఉన్నదా..! 


బుద్ధికన్న ఆరోగ్యం..వర్షించే మేఘమా.. 

నాల్కచివరి రుచులవెంట..పరుగేదో ఉన్నదా..! 


అధికారపు మత్తులోన..విద్రోహపు చర్యలే.. 

అరాచకము అణగించే..ఓటేదో ఉన్నదా..! 


కోట్లకొలది అప్పులతో..ప్రగతి అర్థమేమయ్యె.. 

మేధస్సుకు శ్రమశక్తికి..విలువేదో ఉన్నదా..


Rate this content
Log in

Similar telugu poem from Romance