ఈ కనులలోనా
ఈ కనులలోనా
ఈ కనులలోనా కురిసే కలల వానా............
ఆ కలలలోనా విరిసే నీ నవ్వేనా............
కాలం కరిగిపోతున్నా............
చెదరని రూపమే నీదంటున్నా..............
నా మనసులోనా మురిసే కథ నువ్వేనా..............
నా ఉషస్సులోనా మెరిసే రవి నువ్వేనా..............
సకలం నువ్వవుతున్నా..............
కలకాలం నిను కొలిచేనా.............
నా ఊహల్లోనా విహరించే హృదయం నీదేనా..........
నా ఊపిరిలోనా వినిపించే నాదం నీ పేరేనా...........
నా ఉనికికి ఆయువుగా నీవు.............
నీ ప్రేమకు బానిసగా నేను..............
అప్పటికీ , ఇప్పటికీ , ఎప్పటికీ ఇలాగే............

