నేస్తమా! నీకో లేఖ
నేస్తమా! నీకో లేఖ
*నేస్తమా!నీకోలేఖ*
(కవిత )
ఓ కృష్ణా!గోపాలా!
అందుకోవయా!ఈ కుచేలుని లేఖ.
మిత్రమా!కుశలమా!ఎక్కడ ద్వారక?
ఎక్కడ మారుమూల కుగ్రామము?
పరమాత్మవైన నీవెక్కడ?
పరమ దరిద్రుడనైన నేనెక్కడ?
కృష్ణా!గోపాలా!
నీ తోడి చెలిమి మధురాతి మధురం
నీ తోడి హసితాం నిత్య సీమంతం
నీ తోడి భాషణం గీతా ప్రబోధనం
నీ తోడి భోజనం దివ్య ప్రసాదం
నీ తోడి సాంగత్యం చిర యశోవంతం
నీ తోడి పయనం ముక్తి మార్గ దర్శనం
నీ తోడి సాంగత్యం నిల్పు చిదానందం
నీ తోడి అధ్యయనం జ్ఞాన సముపార్జనం
నీ తోడి శోచనం తత్త్వ పరిశోధనం
ఇన్ని మాటలెందుకు మిత్రమా!
నీ తోడి పరిచయం దివ్య చైతన్య ప్రవాహ భరితం
వదిలి పోకుమా!నన్నీ తమస్సులో
వెంట కొనిపొమ్ము!నిర్మలానంద తేజోలయానికి
ఓ కృష్ణా!గోపాలా!
నడిచి వత్తునయ్యా!నీ పదము పట్టి
నిర్భయముగా నీ కరము పట్టి.
-------------------------------------------------