నేను
నేను
చిరునామా తెలియని ఉత్తరాన్ని.
పండు వెన్నెల్లో నిండు జాబిల్లిని.
నీలాకాశం లో నక్షత్రాన్ని.
ఉరిమే మేఘాన్ని.
కురిసే వర్షం లో తడుస్తున్నా.
లావా ల కరిగిపోతున్నా.
వచ్చే కళ ల మాయమైపోతున్నా.
అడుగు దూరం లో వచ్చి ఓడిపోతున్నా.
కధలలేక ఆగిపోతున్నా నాకు నేను గా.
సముద్రపు అలానే ఎగసిపడుతున్నా.
మంచు ముద్ద నై కరిగిపోతున్నా.
మట్టిలో కుంగిపోతున్నా.
తోడు లేని నీడ నై పోయాను.
గమ్యం తెలియని దారిని.
విజయం అంచున ఓటమిని.
కానరాని కటిక చీకటిని.
చివరకు కనుమరుగైపోయే మానవ దేహాన్ని.
