STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

నేను -నాది

నేను -నాది

1 min
1


గుండెకోత మాటలలో..పెట్టుటెలా ఇపుడు..! 

ఆ వేదన గీతముగా..మలచుటెలా ఇపుడు..! 


మనిషిలోని మనిషి నిదుర..లేవడమే లేదు.. 

ప్రాణానికి విలువ ఇంత..కట్టుటెలా ఇపుడు..! 


ఆత్మీయత మించి అసలు..ధనమేదో ఏమొ.. 

మనసుగుట్టు చెవిచెవిలో..చెప్పుటెలా ఇపుడు..! 


ఎంతవింత బంధాలో..ఎవరికెవరు గాక.. 

హృదయవీణ తంత్రులనే..మీటుటెలా ఇపుడు..! 


ఎంతసేపు "నేను-నాది"..గొడవలోనె బ్రతుకు.. 

అసలు నేను మూలమేదొ..చూపుటెలా ఇపుడు..! 


ఆశ ఎండమావి కదా..నిరాశయే బుడుగు.. 

ఇంతకన్నా మాయలేదు..తెల్పుటెలా ఇపుడు..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics