STORYMIRROR

chavali krishnaveni

Classics

4  

chavali krishnaveni

Classics

నదీమ తల్లి

నదీమ తల్లి

1 min
292

శీర్షిక ...నదీమ తల్లి ఆంతర్యం..


🦢🦢🦢🦢🦢🦢🦢

నదినై ..మీ ముంగిట కొచ్చిన ముత్యాన్ని నేను ..!

కలగా మిగలాలలని ..మీ కసియౌ ఆంతర్యమా ?

శశి నీడలు దాచిన శిల్పమనోజ్ఞ ..నేను ..!

తామస నీడలు ..తాపసి పీడలు ..పెరగాలని ..మీయాకాంక్షా ..?

శుచియై ..శుభ్రమై ..మోక్షద్వారము దెఱుచు ..ప్రహేళికను నేను..!


శోధన తో శోషింప జేయుదారణకృత్య 

జలక్రీడలే మీ మనోవికాసమా ?

సంపూర్ణ నిండు యౌవన జలదాకన్య గా ..ముస్తాబుతో ..నేను! 

విచ్చల విడిగా వ్యర్ధాల , అశుద్ధాల మాలిన్యాల మంటగలుపుటే మీ సౌశీల్యమా ..?

సామాజిక యున్నతి ...సామరస్య సస్య మహోన్నతి ..లక్ష్యంగా ..నేను..!

స్వార్ధ పూరిత జలనాశప్రణాలికా విద్రోహ కుయుక్తులు మీ..అంతరంగమా ...?

సాగర ప్రియుని సమాగమ నిరీక్షణాంతరంగిగా నా

 సమాగమ నిరీక్షణాంతరంగిగా నా తలపుల నావ ..!

అడ్డుగోడలై ..దురాశ , దుశ్చర్యలై మళ్ళింపు మతలబుల మాగన్నుగా ..మీకన్ను ..?

మానవులై నందున నిద్ర మేలుకొలుప వచ్చిన ..మోక్షదాతా జీవచైతన్య స్వరూపాన్ని ...నేను ..

నా చేయూత అందిపుచ్చుకోలేని.. మూర్ఖ రక్కస మానసులామీరూ ...?? 


✍️చావలి బాలకృష్ణవేణి

29/12/'22

హైదరాబాద్


Rate this content
Log in

Similar telugu poem from Classics