STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

నాటి వినోద విజ్ఞానం

నాటి వినోద విజ్ఞానం

1 min
1

నాటి వినోదవిజ్ఞానం 

(కవిత )


నాటి వినోద విజ్ఞానం నేడు మృగ్యం 

వేటువేయగా నా చిత్ర విచిత్రరంగం 


కరిగిపోయేనీ కళలు బహు శోచనీయం!

పరుల నాగరికతకు మనం బానిసలం!


జానపదకళలకు పోషణమే శూన్యం 

కానరాకున్నవీ యుగమున మన ఖర్మం!


తోలుబొమ్మలాటలకు ఘనమౌ చరితం 

కూలిపోయినదీనాడు భారతీయ వైభవం 


ఆనవాళ్ళు కూడా మిగలలేదే!వెఱ్ఱి వాళ్ళం!

జ్ఞానమొసగు కళను కాపాడుకోలేకపోయాం!


ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి చూద్దాం!

అప్పటి సంస్కృతీ విభవాన్ని పూజిద్దాం!


వెనక తరానికి చెందిన కళలు స్ఫూర్తివంతం!

ఘనమగు వారసత్వాన్ని నిలబెట్టుకుందాం!


జీవనమిచ్చి యా కళాకారులను పోషిద్దాం!

భావితరములకు కళా సంపదలనందిద్దాం!//



Rate this content
Log in

Similar telugu poem from Classics