నాకు నీవు
నాకు నీవు
వద్దనుకునే జీవితంకావాలనికోరే
వ్యసనం చేయాలనుకునే నేరం!
అంతుచిక్కని ప్రశ్నవి అందమైన
జవాబువిఅర్థం కాని బంధానివి!
తలపుల తనువుకి అల్లికవై వాస్తవంలో
కంటికి దూరమైపొమ్మంటే మరింతగా దగ్గరై!
ఆనందపు ఆటుపోట్ల అలగా తట్టుకోలేని వేదనకి
రూపంగాకాదు-అవును మధ్య మదిగా!
లోలోనే జరిగే సంగ్రామం నీవుద్వి ప్రవర్తనల
సంఘర్షణ నీవునా పరావర్తనం విశ్లేషణం నీవు!

