STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

నాగన్నా

నాగన్నా

1 min
116

నాగన్నా!

(గేయం )


నాగులచవితికి నాగన్నా!

నదిలో స్నానాలు చేసేమన్నా!

ప్రొద్దున ప్రొద్దున వస్తామన్నా!

చిక్కని పాలను తెస్తామన్నా!

చలిమిడి ముద్దలు తెస్తామన్నా!

చక్కగ హారతులిస్తామన్నా!

పున్నెము లిచ్చెడి దేవుడవన్నా!

పుట్టకు పూజలు చేసెదమన్నా!

పిలిచిన పలికెడి కాపరివన్నా!

పెళ్ళీ పేరంటాలు చేసేవన్నా!

పిల్లా పాపల దీవించుమన్నా!

జల్లని సిరులను కురిపించుమన్నా!

పరమపథంబును చూపెదవన్నా!

భక్తిగ ప్రణతులు చేసెదమన్నా!//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.


Rate this content
Log in

Similar telugu poem from Classics