నా ప్రాణం
నా ప్రాణం
నిన్ను మరిచి నేను జీవించింది ఎప్పుడని
నీ మొదటి పలుకులు నేను మరచింది ఎప్పుడని
చుట్టూ ఎన్ని పెదవులు పలకరిస్తున్న
నాదాక చేరకున్నవి నీవు తప్ప వేరొకలోకం కానకున్నది
నీచివరిమాటను నేను ఎప్పుడు మరిచానని
కొత్త మాటలు తలిచేందుకు
నా ప్రాణం వీడిపోతే నిన్ను ఎక్కడ చూడగలను
నీవు గుర్తించలేవు కూడా నీకోసం తల్లడిల్లిన ఈమనసు ఒకటీ వేచి చూసిందని
లోకం వీడి నేనెల్లి పోతాను నన్ను ఎన్నటికీ గుర్తించలేవు నీ మరపుల్లో మరణించాను అనే బాధతో ఆనాడు నిష్క్రమిస్థాను

