నా మనసు....
నా మనసు....
కనులలో అందమైన కలగా వచ్చి......
కనులకు కనపడని కల్పనగా మారి.....
మది భావాలలో ప్రవహించి ........
మనసు దోచే అల్లిబిల్లి కవితగా మారి ......
నా యద తలుపులను తట్టి .......
నా మనసును పరవశింపచేసి.....
నాలో నన్ను తీసేసి.......
నీ ప్రాణంలో నన్ను కలిపేసి.....
తీయని మాయలో ముంచేసి.......
కరిగిపోని కమ్మని కలగా .......
నా కన్నుల్లో నిండిపోయావు......
వదలి ఉండగలనా నీవు లేకుండా......
విడిచి పోగలనా నిన్ను ఏనాటికైనా......

