STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా హృదయలయ సాక్షి

నా హృదయలయ సాక్షి

1 min
5

నాహృదయ లయసాక్షి..అనురాగ దీపమది..!

నాదేవి ఆండాళ్ళు..నాప్రాణ గీతమది..! 


ఏతీరు చెప్పాలి..ఈమాట లేపాటి.. 

చెలినవ్వు జగమంత..వెన్నెల్ల వర్షమది..!


రాలింది తనువేను..తానేమొ నాలోనె.. 

శతకోటి తారకల..చైతన్య గగనమది..! 


అనుబంధ వనసీమ..చూపగా కుదురునే.. 

నిజచైత్ర గంధాల..అపురూప తీర్థమది..! 


దశదిశల వినిపించు..చెలిమౌన వేదమే.. 

వసివాడి పోకుండు..వాసంత గానమది..! 


మరపెలా ఉండునో..తెలియనే లేనింక.. 

వేదనా తీతమగు..వేదాంత సారమది..! 


మాధవుని గజలింటి..మంగళాంగయె తాను.. 

విశ్వాంత రంగిణీ..నాదాల శిల్పమది..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance