నా గుండె
నా గుండె
నా గుండెలయ
నీ ఎద చప్పుడుతో
కలసి ధ్వనిస్తునే వుంటుంది
అన్నందుకు సంకేతంగా...
చీకటి రాత్రుల ఏకాంతంలో ....
నదిలో ప్రశాంతంగా వున్న
పడవ తెరచాపలా
నీ వచ్చే దారి వైపు చూస్తూ
"అనుభూతుల స్మృతులతో"
సాగుతున్నా...
ఎందుకంటే
నీ దరి చేరాలనే ఆరాటం
యుగాల నాటిది కాబట్టి బంగారం ...!!

