STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నా దేశం

నా దేశం

1 min
9


జీవించే కళనేర్పే..యోగశాల నాదేశం..!
విశ్వానికి గురుతత్వపు..పాఠశాల నాదేశం..!

అమ్మప్రేమ శాస్త్రమెవరు..వ్రాయగలరు ఏ భాషన..
దైవత్వపు రుచి పంచే..పానశాల నాదేశం..!

జెండా రంగులు మూడే..నడుమ ధర్మచక్రం..
నిత్యసత్య జ్ఞానపూర్ణ..కర్మశాల నాదేశం..!

ఎవరి రంగు ఏదైనా..కడిగివేయు నాన్నతనం..
దివ్యప్రేమ చైతన్యపు..యజ్ఞశాల నాదేశం..!

కార్మికులో కర్షకులో..కనే కలల సాక్షి జనని..
శ్రమశక్తిని నమ్ముకున్న..స్వేదశాల నాదేశం..!

హిమగంగా వాహినితో..పునీతమౌ పుడమితల్లి..
పరమశాంతి తపోధనుల..చంద్రశాల నాదేశం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics