మరణం పత్రం
మరణం పత్రం
దీపాల్ని వెలిగిస్తూ పోతున్న దీపం
దుఃఖాన్ని దిగమింగుకున్నది
విషాదాన్ని ఆర్పుతున్న నీరు
ఒకరికొకరు మేఘాల మధ్య మెరుపులా మెరుస్తున్నారు.!!
ఆఖరి చూపు చావు కబురు మూసుకు వస్తే
మేడమీద కాకి ఆత్మబంధువు పిలుపులా వినిపిస్తుంది.
పాపం పండిన నేల మీద రాళ్ల వర్షం కురిస్తే
అమాయకపు లోకం ఒకటి
చీకటి రాత్రి కి మరణ పత్రం రాసిచ్చింది.
నలుపు తెలుపు వెలుగుల్లో
రంగురంగుల కలలు పసిపిల్లల మెదల్లలో పుట్టి కాలం కౌగిలిల్లలో తేలిపోతున్నవీ.
మౌనంగానే యాత్ర సాగుతుంది.
కన్నీరు రక్తం జీవనదులు సమాధుల హృదయాల్లో
గుబులు గుబులుగా నిద్రిస్తున్న.
దీనంగా మూలుగుతున్న మానవత్వం
రేపటికల్లా చనిపోవచ్చునేమో!!?
జాలి దయాని స్పృశించిన చేతి వేళ్ళు
ఇప్పుడు మానసిక దిశల్లో విశ్వమంతాపాకుతున్నాయి.
ఎక్కడ సూర్యుడు ఉదయిస్తాడో ఎక్కడ సూర్యుడు అస్తమిస్తాడు
అర్థం కాని అస్తవ్యస్త పరిస్థితి అది.
నిబ్బరంగా ఉన్న నిశ్శబ్దం పేలినట్లు
నీరసం వైరాగ్యం నైరాస్యం బుల్లెట్లలా
దూసుకుపోతున్నవీ
గాలి నేం చేయలేవవీ అని అరుస్తున్న
కంఠం ఊపిరి తీయబడ్డది.!!
రక్తంతో తడిసిన నేలను చూసి
ఆకాశం చూపు పోగొట్టుకుంది.
తెల్లని ఎండమావులు ఇప్పుడు
పావురాల సందేశాన్ని మోసుకొస్తున్నవీ!!?
రెక్కలొచ్చి ఎగిరిన పర్వతాలను ఆపలేకపోవచ్చు అవీ కానీ
పచ్చని చిలుకల్లా ఎగిరే రోజు ఒకటి వస్తుందని
మైదానం అంతా కొంత భూమిని దానం చేసింది ఇప్పుడిప్పుడే.!!!!?
