మనసు గాయాలు💔
మనసు గాయాలు💔
మనసుని చిధ్రం చేసే మానసిక వేదనలెన్నో
బంధాలకి విలువివ్వని బాంధవ్యాలెన్నో!
అపార్థాల సంకెళ్ళల్లో ఆవిరైన అనుబంధాలు
మాటమాట కలవనివ్వని మాయదారి తెరలు
గుప్పెడంత మనసులో పట్టనంత కసి ఎంతో
పలకరింపులే లేని మనుషుల మనసేంటో!
అర్థం కాదెన్నటికీ, ఎందుకనీ విపరీతం
విధి ఆడిన ఆటల్లో కీలు బొమ్మలేగ మనం!
అన్నిటికీ మందు ఒకటె మరచిపోయి ముందుకుపో!
మలినాత్ముల నొదిలివేసి మనసు బరువు దించుకుపో!
