మనసు
మనసు
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
నా మనసు చిత్తు కాగితం కాదు
పిచ్చి రాతలతో నింపటానికి...
నా మనసు చెత్తకుప్ప కాదు
ఎవరో వేసిన నిందలు మోయడానికి...
నా మనసు ఖాళీ డబ్బా కాదు
గులకరాళ్ళ మోతతో హోరెత్తటానికి...
దైవం నిండిన మనసది
దేనికి భయపడనిదది
మంచిని గుర్తిస్తూ
మనసున్న వారినే ప్రేమిస్తూ
ముందుకు నను నడిపిస్తూ
వెనుకంజ మాట మరపిస్తూ
వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ
నేస్తంలా తోడుంటూ
ఆకాశం హద్దంటూ
నా తప్పులు దిద్దుతూ
నైరాశ్యం కలిగినపుడు బ్రతుకు తీపి తెలుపుతూ
విరిగిపడిన కెరటం మళ్ళీ పుడుతుందంటూ
ఆశావహ జీవితాన్ని పరిచయం చేస్తుంది
అడుగడుగున చేయిపట్టి
మార్గదర్శిగ మెలుగుతూ
నా జీవితాన్ని పండిస్తుంది...
అందుకే...
నా మనసు తోటే నా ప్రయాణం
మంచి వైపుకే ఆ పయనం...
