STORYMIRROR

Sunitha Murthy

Abstract Classics Inspirational

3  

Sunitha Murthy

Abstract Classics Inspirational

కన్నీళ్ళు

కన్నీళ్ళు

1 min
203


         


ఎదను తడిమిన బాధలు...

వ్యధలనొసగు బ్రతుకు ఆటలు...

ఆప్తుల అంతిమ యాత్రలు...

మనసుల నడుమ అంతరాలు...

అన్నింటినీ తేలికపరచు అద్భుత గుళికలు...

అవే... కన్నీళ్ళు!!! 


ఆనందం వెల్లివిరిసినా...

అనుకున్నది సాధించినా...

అమ్మగా జన్మమెత్తినా...

ఎదుటివారి ఆకలి తీర్చినా...

ఆత్మతృప్తిని వందరెట్లు పెంచు అద్భుత గుళికలు...

ఆనందబాష్పాలు...

అవే... కన్నీళ్ళు!!!


బాధ...

ఆనందం...

రెండూ శాశ్వతం కాదని

సమదృష్టితో చూడాలని

అద్భుత సత్యం చాటడానికే

బాధలోనూ... ఆనందంలోనూ...

ఉప్పొంగుతున్న అద్భుత గుళికలు...

అవే...కన్నీళ్ళు!!!


సునీత మూర్తి🖋️🙏


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract