📱మొబైల్ మాయమైతే📱
📱మొబైల్ మాయమైతే📱
ఆ తల్లి కళ్ళల్లో ఆనందం
పిల్లలు వస్తున్నారని...
వీడియోకాల్ 'హాయ్' లిప్పుడు లేవుగా!
ఓ తండ్రి చెప్పే మాటల్ని
కొడుకు శ్రద్ధగా వింటున్నాడు
మెసేజెస్ బిజీలో పరాకుగా "ఊ" కొట్టక!
ప్రేమికులు కళ్ళల్లో ఇళ్ళు కట్టుకుంటున్నారు...
సెల్ఫీల హల్చల్ మాయమైందిగా!
భార్యాభర్తలు సుఖంగా ఊపిరి తీసుకుంటున్నారు
అనవసర జోక్యాల గోల ముగిసిందిగా!
తల్లి తండ్రులకు పిల్లలపై మరింత శ్రద్ధ
ఆన్లైన్ చాటింగ్ లకు, మీటింగ్ లకు తెర పడిందిగా!
ఆకాశంలో చందమామ తెగ మురిసిపోతున్నాడు
మళ్ళీ గోరుముద్దల వేళ తనే హీరోగా!
పిల్లలు పిల్లలతో ఆడుకుంటున్నారు...
మొబైల్ గేములు మటుమాయం కదా!
ఉరుకుల పరుగుల జీవితాన
మంచి సహాయకారిగా
ఎన్నో సదుపాయాలు...
మరెన్నో ప్రయోజనాలు...
మొబైల్ ద్వారానేగా!
కానీ
అరచేతిలో ఇమిడిన ప్రపంచం
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దూరం చేస్తోంది!
ఎక్కడెక్కడో ఉన్న మనుషుల్ని కలుపుతూ
పక్కనున్న వారి మనసుల్ని విరిచేస్తోంది!
నేరం కాదు మొబైల్ ది...
వాడడం తెలియని మనిషిది...!
కారాదు మొబైల్ వ్యసనం...
కేవలం అది ఒక సాధనం...
ఇది గుర్తెరిగి వర్తిస్తే...
కాగలదు మంచి నేస్తం...
లేకుంటే సెల్ లోనే మన జీవితం సమాప్తం...😄
