STORYMIRROR

ARJUNAIAH NARRA

Drama Action

4  

ARJUNAIAH NARRA

Drama Action

మనిషివా? మరమనిషివా?

మనిషివా? మరమనిషివా?

1 min
413

ఓ మనిషి......! 

నీవు మనిషివా? మరమనిషివా?


ఆన్లైన్లో నీవు నాకు పంపె

పూలబొకే పరిమళాన్ని పంచలేవు

బర్త్ డే కేకు పెదవులను తీపి చెయ్యలేవు


ఆన్లైన్లో నీవు నాకు పంపె

వివాహా శుభాకాంక్షల పూలమాల 

నా మెడలో ఎనాటికి పడదు

నీ ఆశీర్వాదాలు అందట్లేవు


నేను సాధించిన విజయానికి

ఆన్లైన్లో నీవు నాకు పంపె 

'కంగ్రాచులేషన్స్' 'అభినందనలు'

నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు


మరణించిన వారి మహాప్రస్థానంలో

నీవు కార్చే కన్నీటి బొట్టుల జాడలు

కనబడుటలేదు.....నీవు పంపించిన

'మై డీప్ కండోలెన్సు' 'రిప్'(RIP) లో నీవే లేవు


బాధలను నీతో పంచుకొవాలనుకొనప్పుడు

ఆన్లైన్లో నీవు నాకు పంపించే ఏ సందేశంలోను

నాకు ఉపశమనం, ఓదార్పును ఇవ్వట్లేవు


నీ ఆత్మీయ పలకరింపు వినక, 

నీవు నాకు భౌతికంగా కనపడక, 

నీ నిజమైన శారీరక స్పర్శను పొందలేక

నిన్ను నా గుండెలకు ఘాడంగా హత్తుకొలేక

నన్ను నేను, నీవు నన్ను, మనల్ని మనం,

రక్త మాంసాల ముద్దలం అని మరిచి

అనుబంధాలను,అనురాగాలను కొల్పోతు

ఈ అనివార్య యాంత్రిక జీవితంలో 

మరమనిషిగా మారిపోతున్నాం


తస్మాత్ జాగ్రత్త! త్వరగామేలుకో!  

నీ తీర్థయాత్ర ఈ భూమి మీద పూర్తికానుంది

'యూవర్ బ్యాటరీ ఈజ్ లోవ్' అని 

మీ 'నెట్వర్క్ పూర్ కనెక్షన్' అని

'యు ఆర్ ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా' అని

మీకు పై నుంచి ఒక సందేశం రానున్నది.....



Rate this content
Log in

Similar telugu poem from Drama