మన తెలుగు
మన తెలుగు
మన జాతిపిత గాంధి..మౌనమే మనతెలుగు..!
ఝాన్సీలు రుద్రమల..తిలకమే మనతెలుగు..!
గీర్వాణి గలగలల..నిజస్వాతి వానరో..
కావ్యాగ్ని ధారలకు..తేజమే మనతెలుగు..!
నన్నయ్య తిక్కన్న..ఎఱ్ఱన్నలను కుదిపి..
మహాభారతమైన..వేదమే మనతెలుగు..!
పోతన్న భాగవత..పదగగన శోభలో..
శ్రీకృష్ణ లీలలకు..అద్దమే మనతెలుగు..!
పొట్టి శ్రీరాములయ..పోరాట సాక్షిగా..
ఏకత్వ సాధనకు..త్యాగమే మనతెలుగు..!
నారాయణాచార్య..ప్రియగాంగ మోహినియె..
శివతాండ వానంద..నాట్యమే మనతెలుగు..!
