STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

మిగలాలట

మిగలాలట

1 min
37


మౌనముగా కరిగిపోతు..కొవ్వొత్తిగ మిగలాలట..! 

బాధలతో కాలిపోతు..సుకుమారిగ మిగలాలట..! 


మగువంటే మారాడని..యంత్రమేమొ పురుషులకై.. 

నవ్వకనే నవ్విపోతు..సుమరాశిగ మిగలాలట..! 


గంధాలకు అతీతముగ..ఎదుగుటకద పరమార్థం.. 

చందనమై అరిగిపోతు..నవగంధిగ మిగలాలట..! 


జాలువారు స్వేదమేమొ..పొంగుటేఱు లైననేమి.. 

నోరెత్తక మరిగిపోతు..శ్రమజీవిగ మిగలాలట..! 


ఇటుగ్లాసును అటుపెట్టని..మగధీరుల సేవికగా.. 

బ్రతుకంతా ఉడికిపోతు..ప్రియకలికిగ మిగలాలట..! 


ఎంతపెద్ద ఉద్యోగం..చేస్తేనేం గొప్పేమిటి.. 

పతిసేవన మునిగిపోతు..దివ్యసతిగ మిగలాలట..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance