మదిలో ఊహలు నదిలో నీరుగ
కదిలే భావన వొకటే నీవని
మనస్సు నిండుగ కొలిచే దానిని
రావా మాధవ రాధా రమణా
ప్రేరణ నీవుగ పవిత్ర సూచిక
సిగలో పింఛము దాల్చితి సఖుడా
పువ్వుల జేసితి ఆభరణాలుగ
రావా మాధవ రాధా రమణ
చేతన నీవని చెలిమిని చేసితి
నీపద సన్నిధి నిలువగ కోరితి
నీజప మందూ నిరతము నిలువా
రావా మాధవ రాధా రమణా
లోకము లన్నియు నీవే ననగా
నీలో లయమై పోవగ నెంచితి
నామొర వినుమా ఉన్నతి నీయగ
రావా మాధవ రాధా రమణా