మదిలో రాగం...❤️
మదిలో రాగం...❤️
మనసులో హాయి రాగాలు
కనులలో కలవరింతల రాగాలు
పెదవులలో మధుర సరాగాలు
తనువంతా గులాబీ సుగంధాల రాగాలు
హృదయమంతా మౌనరాగాలు
ఈ ఏకాంతాన వలపు గానాలు
మౌనాలలో...... మౌనరాగాలలో
కలలలో.....కనుల తొలకరి కవితలలో
మనసులో....... మనసు సరోవరంలో
అందమైన ఊహలలో..... ఆనంద డోలికలలో
చిలిపి నగవులలో...చిత్తము చేరువలో
మనసును హత్తుకున్న హాయిలో
కలలను దాటిన కనులలో
మూగ కడలిపొంగిన మదిలో......

