మైత్రీ ప్రేమ గా మారేవేళ
మైత్రీ ప్రేమ గా మారేవేళ
మనమైత్రీ బంధమూ బలపడిన తరుణములో
వినతినొకటి చేస్తాను అనునయము ఆలకించు
చలచల్లని చూపులు నీవీ తియతియ్యని మాటలు నీవీ
పసిడిమేను కాంతులు జిమ్మీ వెలుగునింపు నామది గదినీ
మిసిమిమోవి నవ్వులు రువ్వీ పరవశింప చేయును నన్నే
నునుసిగ్గుల మొగ్గవు నీవు నులివెచ్చని భావం నాది
నేమెచ్చిన ప్రేమికనీవే హృదివెలసిన దేవత నీవే
నినుచూడక ఉండగలేనే నినుతలవక మెలగగ లేనే
నీవు లేక నరకమునాకూ నీవుయున్న స్వర్గము నాకూ
నినుగోరుచు వేడెదనిన్నే మనసునివ్వు సమ్మతమైతే
తేనీరుకు పిలుపును యిచ్చీ నీమనసున దాగిన భావం
తెలియపరచి నావుగఅంతా నాజవాబువినుమా యిదియే
సవినయాన నామదికోరీ ననుజేరగ వచ్చిన నీకూ
అభిమతాన నాయెదనిచ్చీ నినువీడను కడవర కూనూ
