STORYMIRROR

Midhun babu

Classics Fantasy Thriller

4  

Midhun babu

Classics Fantasy Thriller

కత్తి ఏడుస్తున్నది

కత్తి ఏడుస్తున్నది

1 min
5


రాజకీయాలు రంగుల రాట్నాలుగా

పరిపాలకులు రంగుల కాట్నంగా

ఖద్దరు ఎనక అవినీతి నిద్దర బోతూ

రౌడీలు గుండాలు తెల్లరంగులు పూసుకొని

రాజకీయ రంగస్థలంపై రాజులు నటిస్తూ 

వల్లిస్తున్న మాటలుతన కంటే పదునైన

 వని కత్తి ఏడుస్తున్నది

వావి వరుస లేక పసి పిల్లలను కామించే కామాంధులను, లంచాలు అంటించుకున్న

అవినీతి రాబందులను,పెళ్లగించలేక 

సమ సమాజ నిర్మాణమునకు సాయం

అందించలేక ఒంటరిదై కత్తి ఏడుస్తున్నది.

దళితులపై ధనవంతుల దౌర్జన్యాలను 

ఉన్నత కులాల స్త్రీల అపహరణాలను

చట్టాలను తట్ట బుట్టలో వేసే రక్షక దళాలను 

కాసులకు ఆశపడి కాపాడే న్యాయమూర్తులను

అంతమొందించ లేక కత్తి ఏడుస్తున్నది.

కడుపు నిండిన బలాఢ్యులు

కాలే కడుపుతో ఇబ్బంది పడే వారిపై

చూపే దౌర్జన్యాన్ని ఎదిరించలేక కసితో

ఆవకాయ లోనికి పచ్చిమిరపకాయలను

తరుగుతూ కోస్తూ కత్తి ఏడుస్తున్నది.

ఆనాటి జపాను నగరాలు 

హిరోషియా నాగసాకిలపై 

అణుబాంబుల ప్రయోగాలు

ఈనాడు రాజకీయ నాయకులపై

మావోయిస్టులు, ప్రతిపక్షం వాళ్ళు 

నాటు బాంబు ప్రయోగాలను 

చూసి కత్తి ఏడుస్తున్నది 

కార్మిక కర్షక కళ్యాణానికి

కలం హలం ఖడ్గం పట్టలేదని

బావ కవిత్వ అభ్యుదయ కవిత్వంతో

మినీ కవిత్వ సినీ కవిత్వంతో 

నిద్ర బ్రోతుల్ని తట్టి లేపలేదని 

సాహితీచేతి కత్తి ఏడుస్తున్నది

గద్యంతోను పద్యంతోను

ఖడ్గంతోను కలం తోను

జనహృదయాన్ని కమ్మదనాన్ని

సుఖ శాంతులతో రంజింప 

చేయలేదని కత్తి ఏడుస్తున్నది


Rate this content
Log in

Similar telugu poem from Classics