కథను
కథను
కలతపడే మనసు కథను..చెప్పాలని ఉంది..!
గుండెఘోష మధువులాగ..త్రాగాలని ఉంది..!
చెలి చూపుల వెన్నెలింట..నిజ సమాధి చూడు..
నిజమౌనపు ఆ కోవెల..చేరాలని ఉంది..!
నీకోసం జన్మలుగా..తపస్సులో ఉంటి..
నా గీతం నీకు కాన్క..చేయాలని ఉంది..!
కాంతిపూల తేరుకన్న..ప్రేమాలయ మేది..
అజ్ఞానపు చీకట్లను..కాల్చాలని ఉంది..!
గరికలోన పాలునింపు..చైతన్యమె నిజము..
పాఠ్యాంతరాల గొడవలు..పేల్చాలని ఉంది..!
