కరుణిస్తావా కృష్ణా
కరుణిస్తావా కృష్ణా




కమనీయం నీ నామం
కడు రమణీయం నీ రూపం
కనులతో కాంచినాను
హృది గుడిలో దాచినాను
నీ తలపులతో నిండిన నామది
జోల పాడుతోంది
సేదతీరిన తనువు
నిదురకు ఒరుగుతోంది
కలనైనా కనిపిస్తావా?
కృష్ణా !
తుది పిలుపు వినిపించేలోగా
కరుణిస్తావా కృష్ణా.
****%%%***
ఫణికిరణ్@AK