STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

కరాగిపోనీ

కరాగిపోనీ

1 min
4


రాళ్ళనడుమ ఒకరాయిగ..ఉండి కరిగిపోనీ..! 

జాలువారు నీప్రేమన..నేను కలిసిపోనీ..! 


రాదు నిదుర రాదలసట..లేదుపగలు రేయే..

నాది ఏదొ తెలియదులే..ఇలా రాలిపోనీ..! 


ఇచ్చేందుకు ఏమున్నది..అన్నీ నీవైతే.. 

నీపదముల కాంతులలో..పాట సాగిపోనీ..! 


అడుగకనే అడుగుతీరు..నేర్పినావు సరెలే.. 

ఈ మడుగుకు అంటకనే..చూపు ఆగిపోనీ..! 


మాయామయ చిత్రాలకు..బందీగా ఎందుకు.. 

రంగులేని రాచిలుకను..నవ్వి ఎగిరిపోనీ..! 


మధుమాసం చేసేనా..మోసమేదొ చెప్పక.. 

తెలవారని నాతెలివిక..మరిగి ఇగిరిపోనీ..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics