కొత్త నడకలు
కొత్త నడకలు
1 min
254
అవును
నేనేంటిలా
ఒక చిన్న విషయానికి
ఒక సామాన్య ఊహకు
మనసు పారేసుకున్నాను
అందుకే
నాలో కొత్తకోణం
ఇంతవరకూ అసంపూర్తిగా
మిగిలిన భాగాన్ని
పూర్తి చేసేందుకు
సున్నితమైన ప్రేమ భావాన్ని
అందరిలో రగిలించి
సరైన మార్గం చూపి
ప్రపంచానికి అందించే క్రియలో
కొత్త భావాల రచనలు
బహుశా
మిగిలిన కార్యాన్ని పూర్తి చేసేందుకు..
ముందుకొచ్చి....
ఉప్పెనలా ఉరుకుతోంది
పెరుగుతున్న పాఠకుల సాక్షిగా....
*********%%%%%%%***********