కోయిల గానం
కోయిల గానం
పరిమళించు చైతన్యపు..గొంతు విప్పుతాను..!
అరుణారుణ రవికిరణపు..తేనె పంచుతాను..!
నేనన్నది కణకణమున..పొంగుతున్న అరూపమోయ్..
మోయలేని ఈ నేనుల..బరువు దించుతాను..!
ఊహంటే ఏమున్నది..మనసుచాటు పూలతోట..
కోరికలకు రెక్కలిచ్చి..పైకి పంపుతాను..!
ఆశవెనుక పెద్దపుట్ట..నిరాశయే గమనిస్తే..
మౌననిధికి హృదిహృదినే..పట్టి నడుపుతాను..!
అనుభవాగ్ని ధారలలో..కాలినపుడె అది గజలోయ్..
నిజసమాధి నట్టనడుమ..మదిని నిలుపుతాను..!
వెన్నెలనది మూలాలను..చూడవోయి కన్నులార..
స్వేదజలధి ఉప్పురుచిగ..మిగిలి నవ్వుతాను..!
