కోరుకో
కోరుకో
ఒక వంతెనలా ఎపుడూ..ఉండాలని కోరుకో..!
చెలిమిపూల తీవలాగ..మిగలాలని కోరుకో..!
అసలేమీ ఆశించని..తత్వమేగ నీ స్వయం..
మౌనమైన నిచ్చెనలా..నిలవాలని కోరుకో..!
సాధించేదేమి లేదు..దారికేమి కావాలి..
నీ మాటే ఊయలగా..కావాలని కోరుకో..!
నీకోసం కాకుండా..మెలగటమే మరి ప్రేమ..
నీలోపల ఒక సాక్షిగ..నవ్వాలని కోరుకో..!
రహస్యాలు ఏమి లేవు..శ్వాసలేక ఏముంది..
శ్వాస వెలుగు ఈ జగతికి..పంచాలని కోరుకో..!

