కొండపల్లి బొమ్మ...
కొండపల్లి బొమ్మ...
కొండపల్లి బొమ్మరా ఇది
గుండె పగిలిన తల్లి రా ఇది
గండుశిలగా మారింది
రేతిరి నిదురను మరిచింది
పగటికి కన్నీటిని తాగి జీవించింది
కరుడు గట్టిన హృదయం తో
నలుదిక్కుల నుండి కన్నీటి జలం
కానుకగా అందిస్తున్న వరంగా స్వీకరించి
నత్త నడకన నడిచింది కేవలం
మీ ఆనందాల కోసం తనను తాను
బలిచేసింది కానీ నేడు మాత్రం
తనదే గెలుపు ఎందుకో తెలుసా
తనకు నచ్చిన వారందరిని
ఇన్నాళ్లు గెలిపించింది
ఇప్పుడు మొదలయ్యింది
తనకోసం ఓ కొత్త జీవితo
ఆకలిదప్పులను యోగా తో కట్టడి చేస్తూ
నర నరాలన్నిటిని అదీన పరుచుకుంటున్నా నేర్పరి
జీవితసత్యాన్ని గ్రహించిన అగ్ని కణిక
నేటికీ తనకు తాను గొప్ప మహిళ
మోసాలను మోసం తో జయిస్తాను
ప్రేమను ప్రేమతో బందిస్తాను
నావి కానీ బంధాలను
సునాయసం గా త్యజిస్తాను
నేటికి నేను రేపటికి ఉత్తమ మహిళను...
.... సిరి ✍️
