కనులు మేఘం
కనులు మేఘం
కనుల మేఘం ప్రేమ గుండెని తడుపుతుంటే తప్పు నాదా
కలల తీరం మనసు అలలను తడుముతుంటే తప్పు నాదా
రాతలన్నీ పరిహసిస్తూ విసిరి పోతివి నిన్న నీవే
నీవు రాయని ప్రేమలేఖలు వెతుకుతుంటే తప్పు నాదా
తుంపి వేసిన నవ్వుపూలను చూసినావా ఎప్పుడైనా
నలిగిపోయిన వలపు రెక్కలు విరుగుతుంటే తప్పు నాదా
చోటు లేదని గెంటివేస్తివి గుండె తలుపులు మూసివేస్తివి
నీవు విడిచిన శూన్యమైనే మిగులుతుంటే తప్పు నాదా
నింద మోసిన హృదయమెందుకు మూగబోయెను అడుగు సత్యా ¡!!
నిగ్గదీసే ప్రశ్నగా నే కాలుతుంటే తప్పు నాదా!!

