STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

కనక దుర్గమ్మ వైభవము

కనక దుర్గమ్మ వైభవము

1 min
276


ఇంద్రకీలాద్రిన వెలసె నిందు వదన.

కామితంబులు తీర్చెడి కనక దుర్గ

భక్త జనముల బ్రోచెడి భద్ర యెపుడు

ముజ్జగంబులు రక్షించి మోద మిడును.


సురలు మౌనులు జనులును శుభము కోరి

తొమ్మిది దినంబు లిల పూజ నమ్మ కొఱకు

వినయ మోప్పగా జరిపించ వేడ్క మీర

జయము నొసగెడి శాంభవి జగతి జనని.


తల్లి సేవకై భక్తులు తరలి వచ్చి

నుత్సవంబులు చేయగా నుఱికి నుఱికి

సంతసంబుగ నా తల్లి చెంత చేరి

చింత తీర్చుచు కరుణతో సిద్ధులిడును.


పల్లె లందున పట్టణ వాడలందు

"దుర్గ!దుర్గా!య టంచును దొరలి దొరలి

భక్త జన సమూహము తమ శక్తి కొలది

పాయసాన్నముల్ భోజ్య భక్ష్యములను

తల్లి ముందఱ బెట్టగా దయను జూపి

మురిసి పోవుచు మా యమ్మ వరము లిడును.

మంగళంబులు పాడరో !మాత కిపుడు.

జయము జయమంచు !పొగడరో! జనని నెపుడు.


---------------------------------


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics