కనిపించె వెలుగు వెనక సాగె చీకట
కనిపించె వెలుగు వెనక సాగె చీకట


దరిద్రానికి చిరునామా ఆయన తను,
కన్నీటి వరదల్లో కాలం ఈదుతుంది..
పెట్టిన ప్రతీ భాదని హద్దులు దాటి భరిస్తుంది..
చీకటితో నిండిపోయిన తన దారి,
వెలుగులోకి రమంటే ఎలా వస్తుంది..
వచ్చే అవకాశమే ఉంటె..
బాధ భరించలేక బతుకు బరమవుతుంటే..
మౌనంగా బాధను ఎందుకు భరిస్తుంది.
తనకు ఉన్న ప్రతీ ప్రశ్నలకు సమాధానం శూన్యం..
ఆయాసపడ్తున్న తన హృదయానికి,
తన జీవితం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది..
కనిపించె వెలుగు వెనక సాగె చీకటి పయానం ఒకటి..
ఆ ప్రయాణంలో గతిలేక సాగుతున్న బంధాలెన్నో..
ముడివేసిన భాధ్యతలెన్నో..
మోస్తున్న శోకాలెన్నో..
కష్టపెట్టే దుఃఖాలెన్నో...